స్టాక్ మార్కెట్లు సోమవారం(డిసెంబర్ 13) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం గం.12 లాభాల నుండి నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్, ఏ దశలోను కోలుకోలేదు. అయితే క్రితం సెషన్ 58,000 పాయింట్ల మార్కును మాత్రం నిలబెట్టుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు సూచీలను కిందకు లాగాయి. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు. ఆసియా మార్కెట్ మిశ్రమంగా, ఐరోపా, అమెరికా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి.

భారీగా డౌన్, డిప్‌లో కొనుగోలు చేయవచ్చు
సెన్సెక్స్ 59,103.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,203.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,242.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,619.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,639.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,355.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 503.25 (0.86%) పాయింట్లు లాభపడి 58,283.42 పాయింట్ల వద్ద, నిఫ్టీ 143.05 (0.82%) పాయింట్లు ఎగిసి 17,368.25 పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీ 37,100 వద్ద ముగిసింది.
నిఫ్టీ ప్రస్తుతం 17500 పాయింట్ల దిగువన ఉన్నప్పటికీ, త్వరలో 18000 పాయింట్లకు చేరుకోవచ్చునని, బ్యాంకు నిఫ్టీ 38500ను తాకుతుందని, ప్రస్తుత డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

రూ.1 లక్ష కోట్లు హుష్ కాకి
నేడు సూచీలు భారీగా నష్టపోవడంతో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. 30 షేర్ ప్యాక్ సెన్సెక్స్ 503 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 58,283 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి గరిష్టం నుండి 900 పాయింట్లు పడిపోయింది. దీంతో ఈక్విటీ ఇన్వెస్టర్స్ సంపద రూ.1.06 లక్షల కోట్లు పడిపోయింది. కొన్ని ఐటీ స్టాక్స్ మినహాయించి అన్ని కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఒత్తిడిలో కూరుకుపోయాయి.

టాప్ గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, విప్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications