ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (29, బుధవారం) భారీ నష్టాలతో ముగిశాయి. నిన్న మంచి లాభాలను ఆర్జించిన సూచీలు ఈ రోజు వెనుదిరిగాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ భేటీ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, దేశీయంగా కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేశారు. చాలామంది ఇన్వెస్టర్లు లాభాల్లో అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ ఒత్తిడితో సూచీలు పతనమయ్యాయి. ఇంధనం, ఐటీ రంగాల్లో ఎక్కువగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 421.82 పాయింట్లు నష్టపోయి 38,071 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 11,202 వద్ద క్లోజ్ అయింది.

రిలయన్స్, ఐటీ షేర్లు ఢమాల్
సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీ నష్టాల్లోకి వెళ్లడంతో ఎక్కువ ప్రభావం పడింది. ఓ సమయంలో రూ.2,300కు సమీపంలో ఉన్న రిలయన్స్ షేర్ ధర ఈ రోజు ఏకంగా దాదాపు 4 శాతం (రూ.85.70) నష్టపోయి రూ.2,092 వద్ద ముగిసింది.
గత కొద్దిరోజుల్లో రిలయన్స్ ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. నిప్టీలో రిలయన్స్ టాప్ లూజర్‌గా నిలిచింది. రేపు రిలయన్స్ ఫలితాలు రానున్నాయి. హెచ్‌డీఎప్‌సీ షేర్ దాదాపు 1 శాతం, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు షేర్ దాదాపు 2 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 1 శాతానికి పైగా, టీసీఎస్ షేర్ 1.33శాతం పడిపోయాయి. వీటితో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటో కార్ప్, నెస్ట్లే షేర్లు నష్టపోయాయి. ఆటో షేర్లు నష్టపోయాయి. ప్రధానంగా వీటి ప్రభావం పడింది. 2003 తర్వాత మొదటిసారి ఎబిటా, నెట్ లాస్ నివేదించిన అనంతరం మారుతీ 1.5 శాతం నష్టపోయింది.

ఫార్మా దూకుడు
ఫార్మా, బ్యాంకు షేర్లు లాభాలను ఆర్జించాయి. ఎన్ఎస్‌ఈలో ఫార్మా 3% లాభపడింది. ఇతర రంగాల్లో PSU బ్యాంకులు 1.5%, మెటల్ 0.9% చొప్పున పుంజుకున్నాయి. ఆటో, ఐటీ రంగాలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 6.3% లాభపడింది. క్వార్టర్ వన్ ఫలితాలతో ఇంట్రాడేలో రూ.4,336 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. టాటా స్టీల్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, యూపీఎల్, సిప్లా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గెయిల్, ఐచర్, ఎల్ అండ్ టీ ఒక శాతం నుండి నాలుగు శాతం మధ్య లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 75 పాయింట్లు లాభపడింది. రూ.3,288 కోట్ల ఫండ్ సమీకరించాలని బోర్డు అంగీకరించిన అనంతరం ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు 4 శాతం లాభపడ్డాయి.

బలపడిన రూపాయి
అమెరికా డాలర్ మారకంతో రూపాయి 4 పైసలు బలపడింది. 74.80 వద్ద సెటిల్ అయింది. ఇదిలా ఉండగా, నగదు విభాగంలో మంగళవారం FPIలు రూ.246 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ DIIలు రూ.1,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. సోమవారం FPIలు రూ.453 కోట్లు, DIIలు రూ.978 కోట్ల చొప్పున వెనక్కి తీసుకున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications