మార్కెట్స్ అదుర్స్: సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్, నిఫ్టీ 16,600 పైకి
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(ఆగస్ట్ 24) భారీ లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. మెటల్, ఇన్ఫ్రా, బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ అదరగొట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్బీఐ అంచనాలు మార్కెట్ సెంటిమెంటుకు బలాన్ని ఇచ్చాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.20 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 56,000 పాయింట్లను క్రాస్ చేసింది.
ఉదయం 55,647.11 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 56,023.22 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,536.84 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,561.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,647.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,495.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 403.19 (0.73%) పాయింట్లు లాభపడి 55,958.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128.15 (0.78%) పాయింట్లు ఎగిసి 16,624.60 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 7.79 శాతం, అదానీ పోర్ట్స్ 4.06 శాతం, హిండాల్కో 3.44 శాతం, టాటా స్టీల్ శాతం, 3.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ శాతం, 3.38 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా 1.40 శాతం, నెస్ట్లే 1.20 శాతం, HDFC 1.13 శాతం, ఇన్ఫోసిస్ 1.03 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.02 శాతం ఉన్నాయి.మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications