మూడ్రోజుల్లో 1500 పాయింట్లు జంప్, ఈ స్టాక్స్ 15% లాభపడ్డాయి
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్ పరుగులు తీశాయి. నిఫ్టీ 17,000 పాయింట్లకు పైన ముగిసింది. ఒమిక్రాన్, ద్రవ్యోల్బణ భయాలను అధిగమించి మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు రాణించడంతో దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో నిఫ్టీ కీలక 17 వేల మార్కును దాటింది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఆసుపత్రి పాలయ్యే సందర్భాలు తక్కువ అంటూ అధ్యయనాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 75.23గా ఉంది.

మూడ్రోజుల్లో 1500 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 57,251.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,490.52 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,146.28 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,066.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,118.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,015.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్ చివరకు 384.72 (0.68%) పాయింట్లు లాభపడి 57,315.28 పాయింట్ల వద్ద, నిఫ్టీ 117.15 (0.69%) పాయింట్లు ఎగిసి 17,072.60 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ వరుసగా మూడు రోజుల పాటు 497 పాయింట్లు (మొన్న), 611 పాయింట్లు (నిన్న), 385 పాయింట్లు(నేడు) లాభపడింది. ఈ మూడు రోజుల్లో 1500 పాయింట్ల మేర ఎగిసింది. సోమవారం నష్టాల కంటే ఇప్పుడు కాస్త లాభాల్లో ఉన్నాయి.

మెడ్ ప్లస్ హెల్త్ లిస్టింగ్
దేశీయ రెండో అతిపెద్ద ఫార్మసీ రిటైలర్ మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ 30.65 శాతం ప్రీమియంతో గురువారం లిస్ట్ అయింది. ఈ స్టాక్ షేరు బీఎస్ఈలో రూ.1015 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.1,040 వద్ద ప్రారంభమైంది. ఒక్కో షేర్ ఇష్యూ ధర రూ.796 కంటే రూ.219 (27.51 శాతం) పెరిగింది. చివరికి 40 శాతం లాభంతో రూ.1120 వద్ద ముగిసింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు రెండు శాతం లాభపడింది.

15 శాతం జంప్
నేడు సూచీలు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో పలు స్టాక్స్ 15 శాతానికి పైగా లాభపడ్డాయి. మెడ్ ప్లస్ హెల్త్ కేర్ సర్వీసెస్ Ltd.(40.81%), PTL ఎంటర్‌ప్రైజెస్ (20.09%), ప్రైమ్ ఫ్రెష్ (20.0%), STC ఇండియా (20.0%), యాక్సెల్ ట్రాన్స్‌మాటిక్ (19.99%), శ్రీ కృష్ణ(19.98%), సీన్సిస్ టెక్ (19.98%), యాంబిషన్ మైకా (19.84%), డంకన్ ఇంజినీరింగ్(19.69%), పసుపతి యాక్రోలిన్ (19.49%) లాభపడ్డాయి.