మూడ్రోజుల్లో వెయ్యి పాయింట్ల వరకు డౌన్, నిఫ్టీ 17,620 పాయింట్ల దిగువకు

ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ వారం ప్రారంభ సెషన్‌లో భారీ నష్టాల్లో ప్రారంభమై, ఆ రోజు దాదాపు స్థిరంగా ముగిసిన మార్కెట్లు మరుసటి రోజు నుండి నష్టాల్లో ముగుస్తున్నాయి. సెన్సెక్స్ ఈ వారం ఇప్పటికే దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఉదయం ఊగిసలాటలో కనిపించిన సూచీలు, మధ్యాహ్నం తర్వాత పూర్తిగా నష్టాల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ప్రారంభ సెషన్ సోమవారం సెన్సెక్స్ 29.41 (0.049%) పాయింట్లు లాభపడి 60,077.88 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు సెషన్లు నష్టపోయింది. మంగళవారం 410 పాయింట్ల నష్టంతో, బుధవారం 254.33 (0.43%) పాయింట్లు నష్టపోయి 59,413.27 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మరో 286 పాయింట్లు పతనమై 59,126 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

భారీ నష్టాల్లో మార్కెట్లు

భారీ నష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ 59,549.57 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,557.24 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,019.28 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,718.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,742.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,585.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 286.91 (0.48%) పాయింట్లు క్షీణించి 59,126.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 93.15 (0.53%) పాయింట్లు తగ్గి 17,618.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం 59,459 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఊగిసలాటలోనే ఉంది. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా నష్టాల్లోకి వెళ్లింది.

ఒక దశలో 394 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో కనిష్ఠానికి చేరుకుంది. ఇక డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.24 వద్ద ముగిసింది. రూపాయి సమీప భవిష్యత్తులో 74 నుండి 74.80 స్థాయిలోనే ఉండనుందని కొటక్ సెక్యూరిటీస్ అధినేత అన్నారు.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్ బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, టైటాన్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC బ్యాంకు, HDFC, డాక్టర్ రెడ్డీస్ లాభపడగా మిగతా స్టాక్స్ నష్టపోయాయి. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్ సహా 18 స్టాక్స్ నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 2.03 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.02 శాతం, టాటా మోటార్స్ 0.94 శాతం, సన్ ఫార్మా 0.86 శాతం, ఎన్టీపీసీ 0.85 శాతం నష్టపోయాయి.

టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.64 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.36 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.99 శాతం, ఐచర్ మోటార్స్ 1.87 శాతం, హీరో మోటో కార్ప్ 1.86 శాతం నష్టపోయాయి.

ఇవి అదుర్స్

ఇవి అదుర్స్

మిడ్ క్యాప్ సూచీ 0.4 శాతం మేర లాభపడి అద్భుతంగా రాణించింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్ పతనమైంది. జేఎస్‌డబ్ల్యు స్టీల్ 2 శాతం మేర పడిపోయింది. నిన్న భారీగా లాభపడిన పవర్ గ్రిడ్ కార్పోరేషన్ నేడు ఆ లాభాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఓపెనింగ్ లాభాలను అట్టిపెట్టుకోవడంలో భారతీ ఎయిర్టెల్ విఫలమైంది. ఐవోబీ 11 శాతం మేర లాభపడింది. ఆర్బీఐ పీసీఐ ఫ్రేమ్ వర్క్ నేపథ్యంలో ఇది లాభపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+