భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 10) భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపినప్పటికీ దిగ్గజ షేర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 248 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11,900 పాయింట్లకు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 247.55 పాయింట్లు (0.61 శాతం) తగ్గి 40,239.88 వద్ద, నిఫ్టీ 80.70 పాయింట్లు (0.68 శాతం) కోల్పోయి 11,856.80 వద్ద క్లోజ్ అయింది. రూపాయితో డాలర్ మారకం విలువ 70.92 వద్ద ఉంది.
ఉదయం మార్కెట్లు ప్లాట్‌గా ప్రారంభమై ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. ఐటీ, లోహ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌లో ఏ దశలో కూడా మార్కెట్లు దాదాపు కోలుకోలేదు.

బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్థాన్ యూనిలివర్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, కొటక్ బ్యాంకులు లాభాల్లో ముగిశాయి.
ఎళ్ అండ్ టీ, మారుతీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐఎన్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, ఎన్టీపీసీ, హీరోమోటో కార్ప్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్, యస్ బ్యాంకులు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications