ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైంది. చివరకు సెన్సెక్స్ 214 పాయింట్లు లేదా 0.56 శాతం ఎగిసి 38,434.72 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు లేదా 0.53 శాతం లాభపడి 11,371.60 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.57 శాతం, బీఎస్ఈ స్మాల్ క్టాప్ 1.41 శాతం లాభపడింది. డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు లాభపడి 74.85 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 75 మార్క్‌ను దాటింది. నిఫ్టీ మెటల్, ఐటీ, మీడియా మినహా మిగతా రంగాలన్నీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్, పీఎస్‌యూ బ్యాంకు, ప్రయివేటు బ్యాంకు, రియాల్టీ రంగాలు ఒక శాతానికి పైగా పెరిగాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటో కార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, హిండాల్కో, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ ఉన్నాయి.

ఎన్టీపీసీ ఏకంగా 5 శాతానికి పైగా లాభపడింది. పవర్ గ్రిడ్, ఏషియన్ పేయింట్స్ కూడా 4 శాతానికి పైగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ ఒక శాతానికి పైగా, టాటా స్టీల్ దాదాపు ఒక శాతం నష్టపోయాయి.
వ్యాక్సీన్స్ పైన ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, లాభాలను కొనసాగించినప్పటికీ ఒడిదుడుకులకు లోనయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ ,షేర్లు చివరి గంటలో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.


Click it and Unblock the Notifications