ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో లేదా ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, రియాల్టీ స్టాక్స్ భారీ లాభాలు చవిచూడగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ మార్కెట్లను కిందకు లాగాయి. సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత భారీ నష్టాల్లోకి వెళ్ళింది. ఉదయం నుండి సాయంత్రం వరకు 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ఊగిసలాటింది. అయితే చివరి పది నిమిషాల్లో పుంజుకొని అతి స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ ఆటో 1 శాతం మేర లాభపడింది. ఐటీ, ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

బయటపడేసిన ఆటో, రియాల్టీ
బడ్జెట్ అనంతరం సరికొత్త శిఖరాలను తాకిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అదే సమయంలో ఆటో, రియల్టీ వంటి షేర్లు రాణించడంతో వరుసగా రెండోరోజూ స్వల్పనష్టాలతో బయటపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను కిందకు లాగాయి. నేడు సెన్సెక్స్ 19.69పాయింట్లు లేదా 0.04% నష్టపోయి 51,309.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2.80 పాయింట్లు లేదా 0.02% నష్టపోయి 15,106.50 పాయింట్ల వద్ద ముగిసింది. 1455 షేర్లు లాభాల్లో, 1454 షేర్లు లాభాల్లో ముగియగా, 161 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా లాభపడి 72.84 వద్ద ముగిసింది. ఉదయం రూ.72.87 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 2.88 శాతం, సిప్లా 2.57 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.55 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.14 శాతం, HDFC లైఫ్ 2.01 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 1.87 శాతం, ఐచర్ మోటార్స్ 1.57 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.46 శాతం, టాటా స్టీల్ 1.28 శాతం, బ్రిటానియా 1.08 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.02 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.70 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.95 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.12 శాతం, నిఫ్టీ ఐటీ 0.41 శాతం, నిఫ్టీ మీడియా 0.03 శాతం, నిఫ్టీ ఫార్మా 0.72 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.14 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.63 శాతం, లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.76 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.21 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ మెటల్ 0.08 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.72 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications