ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 177.72 పాయింట్లు లేదా 0.50% ఎగిసి 36,021.42, నిఫ్టీ 55.70 పాయింట్లు లేదా 0.53% లాభపడి 10,607.40 వద్ద క్లోజ్ అయింది. చాన్నాళ్లకు సెన్సెక్స్ 36,000 పాయింట్లు క్రాస్ చేసింది. 1,333 షేర్లు లాభాల్లో, 1359 షేర్లు నష్టాల్లో ముగియగా, 148 షేర్లలో మార్పు లేదు. బ్యాంకింగ్, మెటల్ రంగం మినహా మిగతా అన్నీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మంచి లాభాల్లో ముగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, టీసీఎస్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి.

రూపాయి బలపడుతోంది.. అందుకే
డాలర్ మారకంతో రూపాయి క్రమంగా బలపడుతోంది. నేడు మరో 38 పైసలు బలపడి 74.66 వద్ద క్లోజ్ అయింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పైన సానుకూల సంకేతాలు వస్తుండటంతో మార్కెట్లు పుంజుకోవడం, దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రూపాయి బలపడుతోంది. దీనికి తోడు బలహీన క్రూడాయిల్ ధరలు, అమెరికా డాలర్ బలహీనపడటం కూడా కలిసి వచ్చింది. ఈ రోజు రూపాయి 71.60 వద్ద ఓపెన్ అయింది. 74.66 వద్ద క్లోజ్ అయింది.
ఏప్రిల్ 23వ తేదీ తర్వాత నిన్న ఒక్కరోజు అత్యధికంగా బలపడింది రూపాయి. ఒక దశలో 75 కంటే దిగువకు వచ్చి ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మొత్తానికి మార్చి 27వ తేదీ నుండి 75 మార్క్‌ను దాటింది.

నాటి నుండి 40 శాతం ర్యాలీ
మార్చి కనిష్టం నుండి సెన్సెక్స్, నిఫ్టీలు 40 శాతం ర్యాలీ చేశాయి. కరోనా వ్యాక్సీన్ పైన అంచనాలు, ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం వంటి వివిధ కారణాలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. దీంతో నేడు అంతా మార్కెట్ సానుకూలంగానే ఉన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,110 వద్ద గరిష్టాన్ని తాకగా, 35,872 వద్ద కనిష్టానికి చేరింది.

చమురు ధరలు ఎంత తగ్గాయంటే
ముడి చమురు ధరలు శుక్రవారం బ్యారెల్ 0.73 శాతం పడిపోయి రూ.3,0002కు చేరుకుంది. ఆగస్ట్ కాంట్రాక్ట్ రూ.22 లేదా 0.72 తగ్గి రూ.3,024 వద్ద ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ 1.23 శాతం తగ్గి బ్యారెల్ 40.15 డాలర్లుగా ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ 1.11 శాతం తగ్గి 42.66 డాలర్లు పలికింది.
కాగా, నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) దాదాపు రూ.557 కోట్ల అమ్మకాలు నిర్వహించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ.909 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1696 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, డీఐఐలు రూ.1377 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.


Click it and Unblock the Notifications