For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 142 పాయింట్లు జంప్, నిఫ్టీ 17,800 పాయింట్ల పైన ముగింపు

|

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 7, శుక్రవారం) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నది.కానీ బుల్ జోరు మందగమనంగా కనిపించింది. నిన్న మార్కెట్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఇటీవలి కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఉదయం భారీ లాభాల్లో కనిపించాయి. సెన్సెక్స్ మళ్లీ 60,000 పాయింట్లను దాటింది. కానీ ఆ తర్వాత క్షీణించి, నష్టాల్లోకి వెళ్లినప్పటికీ మళ్లీ కోలుకొని, స్వల్ప లాభాల్లో ముగిసింది.

మంచి లాభాల నుండి మందగమనంలోకి...

మంచి లాభాల నుండి మందగమనంలోకి...

సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 530 పాయింట్ల వరకు ఎగిసి 60,100 పాయింట్లను దాటింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లతో పోలిస్తే దాదాపు రెండు వందల పాయింట్ల తక్కువ సమీపానికి వచ్చింది. అయితే అంతలోనే దాదాపు నాలుగు వందల పాయింట్లు క్షీణించింది.

నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ఉదయం భారీగా లాభపడ్డాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు, రాష్ట్రాల్లో జన సంచారంపై కఠిన నిబంధనలు వంటి అంశాలు ఇన్వెస్టర్లు నేటి గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపేలా చేసింది. దీంతో సూచీలు కాస్త కిందకు జారాయి. పలు రేటింగ్ ఏజెన్సీలు కూడా ఆర్థిక వ్యవస్థ, జీడీపీ తగ్గుతుందని అంచనా వేశాయి. ఈ ప్రభావం పడింది.

ఎగిసి'పడిన' సెన్సెక్స్

ఎగిసి'పడిన' సెన్సెక్స్

సెన్సెక్స్ 59,776.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,130.18 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,401.44 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,797.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,905.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,704.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 142.81 (0.24%) పాయింట్లు ఎగిసి 59,744.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 66.80 (0.38%) పాయింట్లు లాభపడి 17,812.70 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నేడు లాభపడ్డాయి. ఆటో స్టాక్స్ నష్టపోయాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్, ఓఎన్జీసీ, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, లార్సన్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

English summary

సెన్సెక్స్ 142 పాయింట్లు జంప్, నిఫ్టీ 17,800 పాయింట్ల పైన ముగింపు | Sensex ends 142 pts higher, Nifty above 17,800

Eyes are now on the release of the closely watched non-farm payrolls figures for December, which could play a major role in the Fed's decision on when and how quickly to lift rates.
Story first published: Friday, January 7, 2022, 20:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X