నష్టాల నుండి స్వల్ప లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: నిఫ్టీ సరికొత్త శిఖరాలకు...
ముంబై: స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రారంభమై, స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఓ సమయంలో 550 పాయింట్ల వరకు పతనమైన సూచీలు ఆ తర్వాత కాస్త పుంజుకొని, సరికొత్త గరిష్టాలను తాకాయి. FPI ఖాతాల స్తంభన కారణంగా అదానీ గ్రూప్ షేర్లు నేడు పడిపోయాయి. NSEలో అదానీ పోర్ట్స్ షేర్లు దాదాపు 10 శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 52,500 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 15,800 పాయింట్ల పైకి చేరుకొని ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమ సంకేతాలు, దేశీయంగా లాభాల స్వీకరణ నేపథ్యంలో ప్రారంభంలో సూచీలు క్షీణించాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నేడు సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 52,492.34 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,590.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,936.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 76.77 (0.15%) శాతం పెరిగి 52,551.53 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఉదయం 15,791.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,823.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,606.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 12.50 (0.079%) ఎగిసి 15,811.85 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 1.48 శాతం, రిలయన్స్ 1.43 శాతం, విప్రో 1.32 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.24 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.21 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 7.49 శాతం, కోల్ ఇండియా 2.03 శాతం, కొటక్ మహీంద్రా 1.47 శాతం, HDFC 0.80 శాతం, మారుతీ సుజుకీ 0.64 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.08 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.43 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.12 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.28 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.35 శాతం, నిఫ్టీ మీడియా 0.64 శాతం, నిఫ్టీ మెటల్ 0.65 శాతం, నిఫ్టీ ఫార్మా 0.10 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.52 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.51 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.04 శాతం, నిఫ్టీ ఐటీ 0.34 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.58 శాతం, లాభపడింది.


Click it and Unblock the Notifications