లాభాల్లో ముగిసిన మార్కెట్లు, ఆల్ టైమ్ గరిష్టానికి నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాస్త ఓడిదుడుకులకు గురైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. దాదాపు అన్ని రంగాలు రాణించడం సూచీలకు మద్దతుగా నిలిచింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.71 వద్ద క్లోజ్ అయింది. ఉదయం సెన్సెక్స్ 55,862 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది.
ఇంట్రాడేలో 55,675 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయికి దిగివచ్చింది. మధ్యలో 56,188.23 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 175 పాయింట్ల లాభపడి 56,124.72 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16,565 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 16,722 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 68 పాయింట్లు ఎగిసి 16,705.20 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16,722 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది.

సెన్సెక్స్ 30 సూచీలో సగానికిపైగా షేర్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా ఇన్ఫోసిస్ 1.16 శాతం నష్టపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, HDFC, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, HUL షేర్లు రాణించాయి. ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్ట్లే, HCL టెక్, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
అల్ట్రా టెక్ సిమెంట్ 3.64 శాతం, లార్సన్ అండ్ టర్బో 2.66 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.17 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.58 శాతం, సన్ ఫార్మా 1.52 శాతం లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్‌లో ఇన్ఫోసిస్ 1.07 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.04 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.80 శాతం, నెస్ట్లే 0.54 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.42 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ భారీగా లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications