ఆరంభ నష్టాలు ఆవిరి, భారీ లాభాల్లో ప్రారంభమై అంతలోనే పతనం
స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూన్ 22) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీగా లాభపడినప్పటికీ ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ చివరి అరగంటలో ఓ సమయంలో స్వల్ప నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత కాస్త స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్ నుండి బలమైన సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. కరోనా కేసులు తగ్గడం, మహమ్మారి వ్యాక్సీన్ వేగవంతం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కాస్త క్షీణించింది.

భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ...
సెన్సెక్స్ ఉదయం 52,885.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,057.11 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,520.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,840.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,895.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,752.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 26.25 (0.17%) పాయింట్లు లాభపడి 15,772.75 పాయింట్ల వద్ద ట్రేడ్ ముగిసింది. సెన్సెక్స్ 14.25 (0.027%) పాయింట్లు ఎగిసి 52,588.71 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 5.30 శాతం, యూపీఎల్ 3.92 శాతం, శ్రీసిమెంట్స్ 3.59 శాతం, విప్రో 2.66 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.59 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 1.88 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.62 శాతం, నెస్ట్లే 1.20 శాతం, HUL 0.96 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.84 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.17 శాతం లాభపడగా,నిఫ్టీ మిడ్ క్యాప్ 0.22 శాతం నష్టపోయింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.34 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.25 శాతం, నిఫ్టీ ఐటీ 0.55 శాతం, నిఫ్టీ మీడియా 0.07 శాతం, నిఫ్టీ మెటల్ 0.28 శాతం, నిఫ్టీ ఫార్మా 0.09 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.06 శాతం లాభపడ్డాయి. ఇక, నిఫ్టీ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.21 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.68 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.35 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications