ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 63.67 పాయింట్లు లేదా 0.17% ఎగిసి 36,550.95, నిఫ్టీ 13.30 పాయింట్లు లేదా 0.12% లాభపడి 10,777 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 595 షేర్లు లాభాల్లో, 448 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 71 షేర్లలో ఎలాంటి మార్పులేదు. రూపాయి డాలర్ మారకంతో 74.70 వద్ద
ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 76.68 వద్ద ముగిసింది.
కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే
టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐచర్ మోటార్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా, జియో ప్లాట్‌ఫాంలోకి వరుసగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తోన్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఓ దశలో ఈ కంపెనీ షేర్ ధర 3.94 శాతం పెరిగి రూ.1,858.10కి చేరుకుంది. చివరకు 3.57 శాతం లాభంతో రూ.1,851.40 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.40,508 కోట్లు పెరిగి రూ.11,73,677 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ పార్టీ పెయిడప్ షేర్లు రూ.40,000 కోట్లు కలుపుకుంటే మార్కెట్ వ్యాల్యూ రూ.12.14 లక్షల కోట్లకు చేరింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం గం.11.00 సమయానికి ఈ కంపెనీ షేర్ ధర 1.33 శాతం తగ్గి రూ.1827.20 వద్ద ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications