ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు: 15,700 పైనే నిఫ్టీ, ఐటీలో అమ్మకాల ఒత్తిడి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జూలై1) లాభాల్లో ప్రారంభమై, తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. తర్వాత మధ్యాహ్నం గం.1.30 సమయానికి లాభాల్లోకి వచ్చింది. నేటి నుండి ఆటోమొబైల్ కంపెనీలు జూన్ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, దేశీయ సూచీలు ఊగిసలాటలో ఉన్నాయి. ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపగా, పవర్, ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ మధ్యాహ్నం సమయానికి స్వల్ప నష్టాల్లో ఉంది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ 5.69 (0.011%) పాయింట్లు నష్టపోయి 52,479.48 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 2.95 (0.019%) పాయింట్లు ఎగిసి 15,724 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,638.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,638.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,342.02 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,755.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,755.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,685.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో 2.29 శాతం, హిండాల్కో 1.98 శాతం, టాటా మోటార్స్ 1.74 శాతం, సన్ ఫార్మా 1.11 శాతం, హీరో మోటో కార్ప్ 1.08 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో గ్లాండ్ 1.82 శాతం, శ్రీ సిమెంట్స్ 1.78 శాతం, ఇన్ఫోసిస్ 1.05 శాతం, లార్సన్ 1.01 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.04 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 సూచీ 0.04 శాతం, మిడ్ క్యాప్ 0.09 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.14శాతం, నిఫ్టీ బ్యాంకు 0.25 శాతం, నిఫ్టీ ఆటో 1.01, నిఫ్టీ బ్యాంకు 0.25 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.03 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.43 శాతం, నిఫ్టీ మీడియా 0.18 శాతం, నిఫ్టీ మెటల్ 0.22 శాతం, నిఫ్టీ ఫార్మా 0.50 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.07 శాతం నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.44 శాతం, నిఫ్టీ ఐటీ 0.56 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications