ఐదో రోజు భారీ నష్టాలు, సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం, 15,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఫిబ్రవరి 22) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సెన్సెక్స్ 52,000 దాటి 53,000 దిశగా కనిపించినప్పటికీ గత ఐదు సెషన్లుగా అంతకంతకూ పడిపోతోంది. క్రితం వారం వరుసగా నాలుగు సెషన్లు నష్టాల్లో ముగిశాయి. నేడు ప్రారంభంలోనే భారీగా నష్టపోయింది. ఇప్పుడు సెన్సెక్స్ 50,500 దిగువకు పడిపోయింది. ఈ ఐదు సెషన్లలో దాదాపు 2000 పాయింట్లు క్షీణించింది. నిఫ్ట 15,000 మార్కు దిగువకు పడిపోయింది. సూచీలు ఉదయం స్వల్ప నష్టాల్లో ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారీగా నష్టపోయాయి.

సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ గతవారం 50,889 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఉదయం 50,910.51 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,986 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 50,286 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 620 పాయింట్లు నష్టపోయి 50,270 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నిఫ్టీ 14,999 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,010 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,854 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం మార్కెట్లు బాగానే ప్రారంభమైనప్పటికీ, అంతలోనే కుంగిపోయాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడం, బడ్జెట్ అనంతరం ఇన్వెస్టర్లు వరుసగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో నష్టపోతున్నాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 4.95 శాతం, JSW స్టీల్ 3.27 శాతం, టాటా స్టీల్ 2.35 శాతం, అదానీ పోర్ట్స్ 1.97 శాతం, ఓఎన్జీసీ 1.71 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ITC 4.05 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.04 శాతం, లార్సన్ 3.59 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.89 శాతం, మారుతీ సుజుకీ 2.66 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.97 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.40 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఆటో 1.62 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.70 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.75 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.78 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.00 శాతం, నిఫ్టీ ఐటీ 1.39 శాతం, నిఫ్టీ మీడియా 2.21 శాతం, నిఫ్టీ ఫార్మా 0.42 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.87 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.11 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.57 శాతం నష్టపోయాయి. కేవలం నిఫ్టీ మెటల్ 2.68 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications