ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. మార్కెట్లు ప్రారంభం నుండే నష్టాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.45 సమయానికి 460 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, మధ్యాహ్నం గం.11.50 సమయానికి 480 పాయింట్లు నష్టపోయి 38,812 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు నష్టపోయి 11,393 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్లు నష్టపోయింది. డాలర్ మారకంతో రూపాయి రూ.73.05 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు నష్టపోయి, ఆ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి క్షీణించాయి. మరోవైపు, చైనాతో సరిహద్దు అంశం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ప్రాటెల్, మారుతీ సుజుకీ, జీ ఎంటర్టైన్మెంట్, టీసీఎస్, హిండాల్కో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, ఎస్బీఐ ఉన్నాయి.

More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం! భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ముప్పు తప్పదా?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications