For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 17) భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.30 సమయానికి 170 పాయింట్లకు పైగా, నిఫ్టీ 13 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయినప్పటికీ సెన్సెక్స్ 52వేల పాయింట్లకు పైన, నిఫ్టీ 15,700 పాయింట్ల పైన ఉంది.

అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచనుందనే సంకేతాలు భారత్, ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ప్రస్తుతానికి వడ్డీ రేటును దాదాపు సున్నా వద్ద ఉంచి ప్రతినెలా 120 బిలియన్ డాలర్లు విలువైన బాండ్స్ కొనుగోలు చేయనుంది. చమురు ధరల్లో పెరుగుదల కూడా సూచీలపై ప్రభావం చూపాయి. ఓ సమయంలో 300 పాయింట్ల వరకు నష్టపోయింది.

భారీ నష్టాల్లో మార్కెట్లు

భారీ నష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ ఉదయం 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,644.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.30 సమయానికి 165.44 (0.32%) పాయింట్లు నష్టపోయి 52,339.73 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 13.30 (0.084%) పాయింట్లు నష్టపోయి 15,754.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

గెయినర్స్, లూజర్స్

గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.66 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.28 శాతం, శ్రీసిమెంట్స్ 1.03 శాతం, నెస్ట్లే 1.08 శాతం, HDFC లైఫ్ 0.90 శాతం లాభపడ్డాయి.

అదానీ పోర్ట్స్ 7.22 శాతం, టాటా స్టీల్ 3.13 శాతం, కోల్ ఇండియా 1.90 శాతం, హీరో మోటో కార్ప్ 1.45 శాతం, ఎన్టీపీసీ 1.38 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.33 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.62 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.69 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.63 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.84 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.66 శాతం, నిఫ్టీ మీడియా 0.23 శాతం, నిఫ్టీ మెటల్ 1.62 శాతం, నిఫ్టీ ఫార్మా 0.46 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.54 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.58 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.28 శాతం, నిఫ్టీ ఐటీ 0.16 శాతం, లాభపడింది.

English summary

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్ | Sensex drops over 300 points in early trade

Except FMCG, all sectoral indices are trading in the red. BSE midcap index is down 0.9 percent, while Smallcap index is trading flat.
Story first published: Thursday, June 17, 2021, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X