అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ట్రేడింగ్‌ను నష్టాల్లో ప్రారంభించాయి. అమెరికా టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో అక్కడి సూచీలు నిన్న భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్భణం, వడ్డీ రేట్ల పెంపు అక్కడి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి నుండి అననుకూల సంకేతాలు అందుకున్న మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. అలాగే, భారత మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి.

టీసీఎస్ షేర్ అదుర్స్
సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 58,965 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 58,743 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,338 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు నష్టపోయి 58,549 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్ల మేర క్షీణించింది. నిఫ్టీ 146 పాయింట్లు క్షీణించి 17,528 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
టీసీఎస్ త్రైమాసికం ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. టీసీఎస్ షేర్ నేడు 1 శాతానికి పైగా లాభపడి రూ.3,734 వద్ద ట్రేడ్ అయింది. ఫలితాల తర్వాత టీసీఎస్ షేర్లు అదరగొడుతోంది.

మార్కెట్‌పై వీటి ప్రభావం
భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ద్రవ్యోల్భణం ఆందోళనలు, ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం, భారత్ ద్రవ్యోల్భణం ఆందోళనలు, వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్ పైన ప్రభావం కనిపిస్తోంది. చైనాలో కొవిడ్ ఉధృతి కూడా మార్కెట్లను అప్రమత్తతకు గురి చేస్తోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి.

విద్యుత్ లాభాల్లో
విద్యుత్ రంగం మినహా అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. ఆటో, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం నుండి నాలుగు శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, కొటక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, కోల్ ఇండియా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, గ్రాసీమ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications