వరుసగా మూడు రోజుల పాటు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, వరుసగా మూడు రోజుల లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపిస్తోంది. దీంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా కీలక రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. సెన్సెక్స్ ఆరంభంలోనే భారీగా నష్టపోయింది.
సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 53,161పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఉదయం సెన్సెక్స్ 52,846 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,023 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,771 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,757 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,792 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,710 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్లు నష్టపోయి 52,845 పాయింట్ల వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించి 15,739 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

ఆటో రంగం మినహా మిగతా అన్ని రంగాలు కూడా నష్టాల్లో ట్రేడ్ ఉన్నాయి. ఐటీ స్టాక్స్ ఒక శాతం మేర క్షీణించాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, కోల్ ఇండియా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications