For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు: ఇండిగో స్టాక్స్ అదుర్స్

|

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (మే 26) లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 53,750 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 200 పాయింట్లు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం గం.11.30 సమయానికి 250 పాయింట్ల వరకు నష్టపోయింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. అయినప్పటికీ నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

సెన్సెక్స్ నేడు 53,950 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,102 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,456 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ఓ సమయంలో ఉదయం 350 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, ఆ తర్వాత 300 పాయింట్లు కూడా నష్టపోయింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 238 పాయింట్లు ఎగిసి 53,510 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించి 15,925 పాయింట్ల వద్ద కదలాడింది. మొత్తానికి మార్కెట్లు నేడు ఊగిసలాటలో ఉన్నాయి.

Sensex down from day’s high, turns red, Nifty gives up 16000

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ధరలు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్స్ నేడు పది శాతం వరకు ఎగిశాయి. అయితే మధ్యాహ్నం గం.11.30 సమయానికి దాదాపు 5 శాతం ఎగిసి రూ.1715 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.2380. నేడు ఓ సమయంలో రూ.1810 క్రాస్ చేసింది. బ్యాంకింగ్, ఐటీ రంగాలు మినహా మిగతా అన్ని స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి.

English summary

భారీ లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు: ఇండిగో స్టాక్స్ అదుర్స్ | Sensex down from day’s high, turns red, Nifty gives up 16000

Domestic stock markets opened with gains on Thursday morning but soon slipped into the red. S&P BSE Sensex was down 200 points or 0.38% to near 53,535 while the Nifty 50 index gave up 16,000.
Story first published: Thursday, May 26, 2022, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X