ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(సెప్టెంబర్ 24) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 482.90 పాయింట్లు(1.28%) నష్టపోయి 37,185.52 వద్ద, నిఫ్టీ 141.90 పాయింట్లు(1.27%) క్షీణించి 10,990 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 663 పాయింట్లు నష్టపోయి 37,005 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 190 పాయింట్లు కోల్పోయి 10,943 వద్ద ట్రేడ్ అయింది.
173 షేర్లు లాభాల్లో, 1000 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 44 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 24 పైసలు క్షీణించి 73.81 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో 73.57 వద్ద క్లోజ్ అయింది. మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంకు.. ఇలా అన్ని రంగాల షేర్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం మేర నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్ బేజారు
మధ్యాహ్నం గం.11.30 సమయానికి టీసీఎస్ షేర్ ధర 3.75 శాతం నష్టపోయి రూ.2,375 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ 2.60 శాతం నష్టపోయి రూ.993 వద్ద, విప్రో షేర్ 1.73 శాతం క్షీణించి రూ.309 వద్ద, టెక్ మహీంద్ర షేర్ ధర 2.15 శాతం క్షీణించి రూ.776 వద్ద, హెచ్‌సీఎల్ టెక్ షేర ధర 1.77 శాతం క్షీణించి రూ.800 స్థాయికి పడిపోయాయి.
బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ 1.25 శాతం క్షీణించింది. ఎస్బీఐ షేర్ ధర 2.20 శాతం క్షీణించి రూ.180 వద్ద ఉంది.
రిలయన్స్ షేర్ ధర 1.05 శాతం పడిపోయి రూ.2,207 వద్ద ట్రేడ్ అయింది.
టాటా కెమికల్స్ 0.65 శాతం, టాటా మోటార్స్ 2.24 శాతం మేర క్షీణించాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల కారణంగా సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల మేర పడిపోవడానికి కారణమైంది.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టీసీఎస్ ఉన్నాయి.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
రియాల్టీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండస్ట్రియల్, బేసిక్ మెటీరియల్స్ షేర్లు 2 శాతం మేర నష్టపోయాయి.

మార్కెట్ నష్టాలకు కారణాలు..
- ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్, దేశీయ మార్కెట్ పైన పడింది. ఆసియా మార్కెట్ షెంఘాయ్ కాంపోసిట్ ఇండెక్స్, కోస్పి 2 శాతం చొప్పున, నిక్కీ 1 శాతం మేర నష్టపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పడుతుందనే వాదనలు, కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్ పైన ప్రభావం పడింది. దీంతో వాల్ స్ట్రీట్ జర్నల్ నష్టపోయింది.
- కరోనా కేసులు పెరగడం కూడా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. మన దేశంలో కేసుల సంఖ్య 57 లక్షలు దాటాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
- ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి సమయం పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications