భారీ నష్టాల నుండి నష్టాల్లోకి వచ్చిన మార్కెట్లు, మార్కెట్ నష్టాలకు కారణాలివే..
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(ఆగస్ట్ 20) భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ నేటి ఓపెనింగ్ ట్రేడ్‌లోనే దాదాపు 500 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ఉంది. మధ్యాహ్నం గం.2.15 సమయానికి సెన్సెక్స్ 215 పాయింట్ల నష్టాల్లో ఉంది. అధిక వెయిటేజీ కలిగిన పలు స్టాక్స్ నష్టోయాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం అదరగొడుతున్నాయి. నిఫ్టీ ఓ సమయంలో 16,400 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. నిన్న 55,630 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 600 పాయింట్లకు పైగా క్షీణించి 55,013 వద్ద ట్రేడ్ అయింది. ఏ దశలోను కనీసం నిన్నటి స్థాయి దరిదాపుల్లోకి రాలేదు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.29 వద్ద ట్రేడ్ అయింది.
ఆసియా మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. పైగా సూచీలు గరిష్ఠాల వద్ద నమోదు అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు నష్టాల్లో ఉన్నాయి.
పలు దేశాల్లో కరోనా మహమ్మారి పెరుగుదల, చైనా ఆర్థిక బలహీనత సంకేతాలు, ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలు పెట్టుబడిదారులను భయానికి గురి చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు కాస్త కల్లోలంగా ఉన్నప్పటికీ, భారతీయ మార్కెట్లు ఇప్పటికీ కాస్త సానుకూలంగా ఉన్నాయని పీఎంఎస్ హెమ్ సెక్యూరిటీస్ హెడ్ మోహిత్ నిగమ్ అన్నారు.

బ్లూచిప్స్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం సమయానికి నిఫ్టీ 50 స్టాక్స్‌లో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇది 1 శాతానికి పైగా లాభపడింది. ఆ తర్వాత ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్ టెల్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, HDFC లైఫ్ ఇన్సురెన్స్, బ్రిటానియా కూడా టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. హిండాల్కో 4 శాతానికి పైగా నష్టపోయి టాప్ లూజర్‌గా ఉంది. టాటా స్టీల్ ఆరు శాతానికి పైగా నష్టపోయింది. ONGC, JSW స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ కూడా నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్ భారీ నష్టాలకు పలు కారణాలు ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ ద్వారా ప్రచురించబడిన ఫోమ్స్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల పైన ప్రభావం చూపింది. ఫెడరల్ రిజర్వ్ బాండ్స్ కొనుగోళ్ల తగ్గింపు అవకాశాలు పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నవంబర్ ఆరంభం నుండి డాలర్‌ను అత్యున్నతస్థాయికి తీసుకు వెళ్లింది. ఇది శుక్రవారం కూడా కొనసాగింది.
బ్రోడర్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.54 శాతం, మిడ్ క్యాప్ సూచీలు 0.36 శాతం నష్టపోయాయి. బ్రోడెస్ట్ ఇండెక్స్.. నిఫ్టీ 500 ఏకంగా 0.49 శాతం నష్టపోయింది. జపాన్ మినహా మిగతా ఆసియా పసిఫిక్ మార్కెట్లు 0.75 శాతం మేర నష్టపోయాయి. చైనీస్ బ్లూ చిప్ కంపెనీలు ఏకంగా 1.22 శాతం, హాంగ్ కాంగ్ 0.53 శాతం పతనమయ్యాయి.


Click it and Unblock the Notifications