లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు: HDFC ట్విన్స్ నష్టాల్లో..
స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 5) ఊగిసలాటలో ఉన్నాయి. సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా - పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. HDFC జంట కంపెనీల విలీన ప్రకటనతో నిన్న భారీగా లాభపడిన సూచీలు నేడు స్థిరీకరణ దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు.
నిన్నటి భారీ ర్యాలీ నేపథ్యంలో గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిన్న రూ.1,152 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1675 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. నేడు బ్యాంకింగ్ స్టాక్స్ మినహా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. ఆటో భారీ లాభాల్లో ఉంది.

టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, గ్రాసీమ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు, HDFC, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, రిలయన్స్ ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.75.37 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ కార్పోరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనంగా HDFC ట్విన్స్ నిలిచింది. దేశీయ అతిపెద్ద గృహ రుణ సంస్థ HDFC, అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు HDFC బ్యాంకు విలీనమవుతున్నాయి. నిన్న షేర్లు దాదాపు పది శాతం లాభపడ్డాయి. నిన్న HDFC ట్విన్స్ వల్ల మార్కెట్లు భారీగా లాభపడగా, నేడు అవే స్టాక్స్ దెబ్బతీశాయి.


Click it and Unblock the Notifications