ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 15) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రెండు స్థూల ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు నిరాశ కలిగించాయి. ఫిబ్రవరిలో ఆహార ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల గరిష్ఠానికి చేరుకుంది. డిసెంబర్ నెలలో సానుకూలంగా నమోదైన పారిశ్రామికోత్పత్తి జనవరిలో మళ్లీ ప్రతికూలత నమోదు చేసింది. ఆహార వస్తువుల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో మూడు నెలల గరిష్టం 5.03 శాతానికి చేరుకుంది.
పారిశ్రామికోత్పత్తి సూచీ క్షీణించింది. గనులు, తయారీ వంటి వివిధ రంగాల్లో ఉత్పత్తి తగ్గి జనవరిలో ఈ సూచీ 1.6 శాతం మేర క్షీణించింది. అమెరికా సూచీలు కూడా గతవారం ప్రతికూలంగా క్లోజ్ అయ్యాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. దీనికి దేశీయ గణాంకాలు తోడవడంతో మార్కెట్లు నష్టపోయాయి.

నిఫ్టీ 15,000 పాయింట్ల కిందకు
మార్కెట్లు నేడు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 50వేల పాయింట్ల స్థాయికి పడిపోయింది. సెన్సెక్స్ 50,773.47 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,834.78 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,068.83 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11 సమయానికి 698.28 (1.37%) పాయింట్లు పిపోయి 50,093 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,048.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,048.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,818.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 11 గంటల సమయానికి నిఫ్టీ 211.40 (1.41%)
పాయింట్లు పడిపోయి 14,819 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15000 పాయింట్ల దిగువకు పడిపోయింది.
సెన్సెక్స్ ఆ తర్వాత కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.11.15 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 827 పాయింట్లు నష్టపోయి 49,964 పాయింట్ల వద్ద, నిఫ్టీ 237 పాయింట్లు నష్టపోయి 14,793 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 50 పాయింట్ల దిగువకు పడిపోయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 1.40 శాతం, HCL టెక్ 1.03 శాతం, TCS 0.89 శాతం, నెస్ట్లే 0.60 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.55 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 3.72 శాతం, కోల్ ఇండియా 3.26 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.92 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.77 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.78 శాతం నష్టపోయాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.44 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.50 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.22 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.58 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.01 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.30 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.36 శాతం, నిఫ్టీ మీడియా 1.85 శాతం, నిఫ్టీ మెటల్ 0.88 శాతం, నిఫ్టీ ఫార్మా 1.86 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.80 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.32 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.85 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.26 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications