స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అద్భుత రికార్డ్: సెన్సెక్స్ 60,000 పాయింట్లు దాటి పరుగులు
దేశీయ స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులు సృష్టించింది. సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్కును దాటగా, నిఫ్టీ 18,000 పాయింట్లు మరింత దగ్గరయింది. శుక్రవారం సెన్సెక్స్ ప్రారంభంలోనే 60,000 పాయింట్ల మైలురాయిని తాకింది. దేశీయ మార్కెట్లు నిన్న భారీగా జంప్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా పరుగులు తీశాయి. మంచి లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ సూచీలు లాభాల్లో, సింగపూర్, హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా సానుకూల పరిణాములు బుల్ రంకెకు కారణంగా ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.73.78 వద్ద ట్రేడ్ అయింది.
నేడు (శుక్రవారం, సెప్టెంబర్ 24) సెన్సెక్స్ 60,158.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,333.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,030.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,897.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,947.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,857.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.15 సమయానికి 274.29 (0.46%) పాయింట్లు లాభపడి 60,159.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73.75 (0.41%) పాయింట్లు ఎగిసి 17,896.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి ప్రారంభ సెషన్‌లో టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసీమ్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఐటీసీ, ఎస్బీఐ, హిండాల్కో ఉన్నాయి. బీఎస్ఈ 30 స్టాక్స్‌లో 30 షేర్లు లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications