Sensex@ 70K: సరికొత్త రికార్డులకు సెన్సెక్స్ సూచీ.. 70,000 మార్కు దాటి.. భవిష్యత్తు ఎటు..

Sensex High: బీఎస్ఈ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఈ క్రమంలో తొలిసారిగా 70,000 పాయింట్ల మార్కును అధిగమించింది. నిఫ్టీ సూచీ 21,000 మార్కును అందుకున్న కొన్ని రోజులకే ఇది చోటుచేసుకుంది.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మార్కెట్లు సమీపకాలంలో బుల్ ర్యాలీని చూస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా సూచీలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నందున ఇన్వెస్టర్లు ప్రాఫిట్-బుకింగ్ చేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గౌరంగ్ షా కూడా మార్కెట్ల దీర్ఘకాలిక వృద్ధి పథంలో బుల్లిష్ సెంటిమెంట్‌ ఉంటుందన్నారు.

Sensex crossed 70000 mark after few days of nifty reaching 21000 mark

ప్రస్తుతం ఒపెక్ దేశాలు స్వచ్ఛందంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కోతలను ప్రకటించినప్పటికీ.. ముడి చమురు సడలింపు స్థాయిల వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి ద్రవ్య విధాన సమావేశంలో సానుకూలంగా ఉన్నందున దీర్ఘకాలంలో మార్కెట్ ఊపందుకోవటానికి బలాన్ని చేకూరుస్తోంది. అలాగే భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు సైతం స్థిరంగా ఉంటాయని, దీనికి మ్యాక్రో స్థాయిలో పరిస్థితులు సహకరిస్తున్నాయని నిపుణులు చేబుతున్నారు.

ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.26,505.29 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని, యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు తిరోగమనం, డాలర్ కదలికల మందగమనంపై ఆశలు పెట్టుకున్నాయి. నేడు ఇంట్రాడే సమయంలో సెన్సెక్స్ సూచీ 70,057.83 స్థాయి వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇది మరింతగా పెరేగ్ అవకాశాలు మార్కెట్లో కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+