కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: డీల్‌కు రిలయన్స్ నో, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా నేడు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 12300 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు భౌగోళిక-రాజకీయ పరిణామాలు, కరోనా కొత్త కేసుల గణాంకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. కార్పోరేట్ ఫలితాలు, యాజమాన్య వ్యాఖ్యలపై ఆధారపడి, ఎంపిక చేసిన షేర్లలో చలనాలు ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

సూచీలు సోమవారం తీవ్ర నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 57,197 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 57,000 మార్కు దిగువనే ప్రారంభమై, ఏ దశలోను ఈ పైకి చేరుకోలేదు. ఉదయం 56,757 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,875 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,412 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.10 సమయానికి సెన్సెక్స్ 555 పాయింట్లు క్షీణించి 56,640 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో దాదాపు 800 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 211 పాయింట్లు క్షీణించి 16,961 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

Sensex crashes over 600 points, Future Group stocks plunge

రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందం రద్దు నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు నేడు భారీగా క్షీణించాయి. రిటైల్, హోల్ సేల్, ట్రాన్సుపోర్ట్, గిడ్డంగులను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ రద్దు చేసుకుంది. దీంతో ఫ్యూచర్ రిటైల్ సెక్యూర్డ్ రుణదాతలు ఈ విలీన పథకానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని అమలు చేయలేమని రిలయన్స్ శనివారం తెలిపింది. దీంతో ఫ్యూచర్ కన్స్యూమర్స్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ షేర్లు దాదాపు 20 శాతం మేర, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 10 శాతం, ఫ్యూచర్ రిటైల్ దాదాపు 5 శాతం క్షీణించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+