Isreal-Iran War: నిన్న మార్కెట్ల శెలవు తర్వాత నేడు తెరుచుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. మధ్యప్రాశ్చంలో ఇరాన్-ఇరాక్ ఉద్రిక్తతలు తారాస్థాయిలకు చేరుకున్న వేళ చమురు ధరలు ఒక్కసారిగా పెరగటం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా చల్లబడుతున్న వేళ యుద్ధం రావటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు సైతం జాగ్రత్తపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో నేడు మార్కెట్లు ఆరంభం నుంచే భారీ నష్టాలతో ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 748 పాయింట్ల నష్టంలో ఉండగా.. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 231 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 470 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 558 పాయింట్ల నష్టాన్ని చూశాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

నిపుణుల మాట ఇదే..
ఈ సంఘర్షణ ముదిరేకొద్దిద క్రూడ్ ధరలు పెరుగుతాయని మళ్లీ బ్యారెల్ ధర 85 డాలర్లు దాటే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచ మార్కెట్లు పెద్ద కరెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో భారతీయ స్టాక్ మార్కెట్లు 10-15 శాతం మధ్య కరెక్షన్ చూడవచ్చని డీఆర్ చోక్సీ ఫిన్‌సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవన్ చోక్సీ తెలిపారు. గడచిన కొన్ని రోజులుగా మార్కెట్ కరెక్షన్ దశలోకి వెళ్లిందని, అయితే స్వల్పకాలంలో 5-6 శాతం వరకు క్షీణతను చూడవచ్చని పేర్కొన్నారు. అలాగే ముడిచమురు ధరలు పెరిగి అవి ద్రవ్యోల్బణాన్ని ట్రిగర్ చేయవచ్చన్నారు. ఆర్థిక లోటు సమయంలో ఇలాంటి పరిణామాలు మార్కెట్లను పెద్ద కుదుపుకు లోనుచేస్తాయని జపాని పేర్కొన్నారు. పెరుగునున్న చమురు ధరలు ప్రత్యక్షంగా భారతీయ కరెంట్ ఖాతాలోటును పెంచుతుంది.
మార్కెట్ల పతనం వేళ ఎన్ఎస్ఈ ఇంట్రాడేలో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, హిందాల్కొ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, విప్రో, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, నెస్లే, రిలయన్స్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications