Market Crash: లోయలోపడ్డ సెన్సెక్స్, నిఫ్టీ.. దలాల్ స్ట్రీట్‌లో ఏం జరుగుతోంది..??

Sensex Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు సూచీలు రికార్డు పతనాన్ని నమోదు చేశాయి. నిన్నటి ప్లాట్ ముగింపు తర్వాత నేడు మార్కెట్లు రికవర్ అవుతాయని అందరూ ఆశించినప్పటికీ చివరికి బేర్స్ రంగంలోకి దిగటంతో మార్కెట్లు కుప్పకూలాయి.

వాస్తవానికి మార్కెట్ల పతనానికి దారితీసిన ముఖ్యమైన 5 అంశాలను గమనిస్తే.. ముందుగా మార్కెట్లలో లోక్ సభ ఎన్నికల ఆందోళనలు అలుముకున్నాయి. దీనికి తోడు మార్చి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు కొనుగోళ్ల ర్యాలీకి ఆజ్యం పోయటంలో విఫలం కావటం రెండవ కారణంగా ఉంది. కొంతమంది US ఫెడరల్ రిజర్వ్ అధికారుల నుంచి ఇటీవలి హాకిష్ కామెంట్స్ భారతీయ ఈక్విటీలపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. మిన్నియాపాలిస్ ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ నీల్ కష్కరీ స్థిరమైన ద్రవ్యోల్బణం, హౌసింగ్ మార్కెట్ బలాన్ని ఉటంకిస్తూ మిగిలిన సంవత్సరంలో ఫెడ్ రేట్లు స్థిరంగా ఉంచాలని సూచించారు. ముడిచమురు ధరల పెరుగుదల, నేడు నిఫ్టీ ఆప్షన్‌ల కాంట్రాక్ట్‌ల వారంవారీ గడువు ముగియడం మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి.

Sensex crashed 1000 points small and midcaps blead amid high volatality today

మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1062 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 345 పాయింట్లను నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 533 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 927 పాయింట్లు నష్టాన్ని చవిచూశాయి. అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా నష్టపోయాయి.

మార్కెట్ల క్లోజింగ్ సమయంలో హీరో మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో ఎల్ అండ్ టి, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, టాటా కన్జూమర్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+