స్టాక్ మార్కెట్లు గురువారం (ఏప్రిల్ 8) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుండి లాభాల్లోనే పైకి, కిందకు కదలాడాయి. అయితే చివరి అరగంటలో ఓ సమయంలో నష్టాల్లోకి వెళ్లి, ఆందోళనకు గురి చేసినప్పటికీ, మళ్లీ కాస్త పైకి ఎగబాకింది. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఇవ్వెస్టర్లు మధ్యాహ్నం నుండి ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి.

చివరకు సెన్సెక్స్
సెన్సెక్స్ ఉదయం 49,885.26 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,118.08 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,581.71 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నిన్న 49,661.76 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 360 పాయింట్ల మేర కూడా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 84.45 (0.17%) పాయింట్లు ఎగిసి 49,746.21 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,875 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,984 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,821 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 54.75 (0.37%) పాయింట్లు ఎగిసి 14,873.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 9.21 శాతం, టాటా స్టీల్ 4.98 శాతం, శ్రీసిమెంట్స్ 4.47 శాతం, టైటాన్ కంపెనీ 3.78 శాతం, హిండాల్కో 3.69 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 1.13 శాతం, సన్ ఫార్మా 1.09 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 1.09 శాతం, ఓఎన్జీసీ 1.00 శాతం, HDFC బ్యాంకు 1.00 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్ 0.37 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.22 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.42 శాతం, నిఫ్టీ ఐటీ 1.18 శాతం, నిఫ్టీ మీడియా 0.35 శాతం, నిఫ్టీ మెటల్ 3.92 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.81 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.63 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.32 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ ఫార్మా 0.04 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.85 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.63 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications