ప్రాఫిట్ బుకింగ్, భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ( జూన్ 16) నష్టాల్లో ప్రారంభమై, రోజంతా అదే విధంగా కొనసాగి చివరకు అలాగే ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు, నిఫ్టీ 100కు పైగా పాయింట్ల నష్టంతో ముగిసింది. గత నాలుగు సెషన్లుగా లాభపడిన సూచీలకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడడం సూచీలను కిందకు దిగజార్చింది. డాలర్ మారకంతో రూపాయి రూ.73.30 వద్ద ట్రేడ్ అయింది.

భారీ నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 52,782.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,816.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,425.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,847.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,880.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,742.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 271.07 (0.51%) పాయింట్లు నష్టపోయి 52,501.98 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 101.70 (0.64%) పాయింట్లు నష్టపోయి 15,767.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

గెయినర్స్, లూజర్స్
సెన్సెక్స్ 30 సూచీలో టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్, ఎన్టీపీసీ, నెస్ట్లే, ONGC, HUL లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.64 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.12 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.79 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.69 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.61 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.60 శాతం, నిఫ్టీ మీడియా 1.09 శాతం, నిఫ్టీ మెటల్ 2.85 శాతం, నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.01 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.26 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.72 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.58 శాతం, నిఫ్టీ ఐటీ 0.25 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications