భారీ నష్టాల నుండి లాభాల్లోకి.. మళ్లీ నష్టాలు: కిందకు లాగిన ఐటీ, ఆటో
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం మంచి లాభాలు నమోదు చేసినప్పటికీ, తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. ఈ వారం లాభాలతో ప్రారంభమై, వరుసగా రెండు సెషన్‌లలో నష్టాలు నమోదు చేసిన సూచీలు, నిన్న లాభాల్లోకి వచ్చాయి. అయితే అంతలోనే నేడు తిరిగి నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ నేడు 600 పాయింట్ల మేర పైకి కిందకు కదలాడింది. నిన్న 48వేలు క్రాస్ చేసిన ముగిసిన సెన్సెక్స్, నేడు ఆ మార్క్ దిగువకు పడిపోయింది.

నష్టాల నుండి లాభాల్లోకి.. మళ్లీ నష్టాల్లోకి
సెన్సెక్స్ ఉదయం 47,863.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,265.39 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,669.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 202.22 (0.42%) క్షీణించి 47,878.45 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 600 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ నిఫ్టీ 14,326.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,461.15 వద్ద గరిష్టాన్ని, 14,273.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 64.80 (0.45%) పాయింట్లు క్షీణించి 14,341.35 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో 3.78 శాతం, ఎన్టీపీసీ 3.64 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.92 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.71 శాతం, BPCL 1.12 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.73 శాతం, బ్రిటానియా 2.71 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.56 శాతం, విప్రో 2.25 శాతం, టెక్ మహీంద్రా 1.82 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.45 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.33 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.49 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.93 శాతం, నిఫ్టీ ఐటీ 0.84 శాతం, నిఫ్టీ మెటల్ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.44 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.10 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.04 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.96 శాతం, నిఫ్టీ మీడియా 0.47 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.30 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications