ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, నిఫ్టీ 16,635 పాయింట్ల వద్ద క్లోజ్
స్టాక్ మార్కెట్లు బుధవారం(ఆగస్ట్ 24) ఫ్లాట్‌గా ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం కాస్త పడిపోయినప్పటికీ మళ్లీ పుంజుకున్నాయి. అయితే చివరి గంటలో ప్రాఫిట్ బుకింగ్ సహా వివిధ అంశాలు ప్రభావం చూపి, నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత స్వల్పంగా పుంజుకొని, స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్ 14.77 (0.026%) పాయింట్లు నష్టపోయి 55,944.21 పాయింట్ల వద్ద, నిఫ్టీ స్వల్పంగా 10.05 (0.060%) పాయింట్లు లాభపడి 16,634.65 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఆద్యంతం ఊగిసలాటలో కనిపించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒడుదొడులు కనిపించాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.23 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 56,067 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. ఇంట్రాడేలో 55,899 పాయింట్ల వద్ద కనిష్ఠస్థాయికి వచ్చింది. చివరకు 14 పాయింట్ల నష్టంతో 55,944 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 10 పాయింట్లు పెరిగి 16,634 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో సగానికి పైగా షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్ సర్వ్ 3.29 శాతం నష్టపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, నెస్ట్లే, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, HDFC, HUL షేర్లు రాణించాయి. బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, ఇన్ఫ్రా, ఇంధన, ఐటీ షేర్లు లాభాల్లో, టెల్కో, రియాల్టీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో రంగాలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.


Click it and Unblock the Notifications