Stock Market: రోజంతా ఊగిసలాడి ఫ్లాట్ ముగింపు.. కిందకు దిగిరానంటున్న సూచీలు
Closing Bell: అంతర్జాతీయ మార్కెట్లను ఫాలో అవుతూ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే నోట్‌లో ముగిశాయి. ఇటీవల గరిష్ఠాలను తాకిన మార్కెట్లు కిందకు దిగివచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
సాయంత్రం మార్కెట్లు మగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 26 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 18 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 321 పాయింట్ల మేర లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. మార్కెట్లను పరిశీలిస్తే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి.

NSEలో సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, యూపీఎల్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, మారుతీ, టైటాన్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బ్రిటానియా, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ ముగించాయి.

ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, టీసీఎస్, రిలయన్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications