Market Closing: ఉదయం లాభాల్లో ప్రయాణాన్ని మెుదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఒడిదొడుకుల్లో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సూచీ మార్కెట్ క్యాప్ రూ.300 లక్షల కోట్ల మార్కును అధిగమించి రికార్డు సృష్టించింది.
మార్కెట్లు ఓలటాలిటీలో ట్రేడింగ్ కొనసాగించి చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ప్రధానంగా ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు మాత్రం లాభపడ్డాయి.

మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 10 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 150 పాయింట్లు నష్టపోయింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 256 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది.
NSEలో బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, నెస్లే, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.

ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, యూపీఎల్, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్, విప్రో, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, రిలయన్స్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications