Stock Market: భారీ నష్టాల్లో బెంచ్‌మార్క్ సూచీలు క్లోజ్.. అల్లాడిన ఇన్వెస్టర్లు..
Stock Market: వరుస సెలవుల తర్వాత ఉదయం ప్రారంభమైన మార్కెట్లపై ఐటీ రంగం నీలినీడలు అలుముకున్నాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్లకు రుచించకపోవటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం షేర్లు కనిష్ఠానికి పడిపోయాయి.
మార్కెట్ల ముగింపు సమయానికి బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 520 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ సూచీ 121 పాయింట్ల నష్టాలతో ప్రయాణాన్ని ముగించింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ గరిష్ఠంగా 950 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే సెకండ్ హాఫ్ లో రికవర్ అయింది. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం బ్యాంకింగ్ షేర్ల మద్ధతు కారణంగా పుంజుకుని 130 పాయింట్ల లాభంలో క్లోజ్ అయ్యింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 122 పాయింట్ల లాభాలతో ప్రయాణాన్ని ముగించింది.

ప్రధానంగా నేడు టెక్ కంపెనీల షేర్లు డీలా పడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, కరోనా కేసులు దేశంలో మళ్లీ విపరీతంగా పెరగటం వంటి కారణాలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, బ్రిటానియా, కోల్ ఇండియా, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఎల్ టి, ఎన్టీపీసీ, విప్రో, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, సిప్లా, ఎయిర్ టెల్, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications