భారీ లాభాల నుండి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 30) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీగా నష్టపోయిన సూచీలు, నేడు మధ్యాహ్నం వరకు దూకుడు మీద ఉన్నాయి. చివరి గంటలో నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో వంద పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ ఆ తర్వాత కాస్త కోలుకొని 67 పాయింట్ల లాభాల్లో ముగిసింది. ఉదయం సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 300 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ నష్టపోయాయి. చివరలో విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడంతో నష్టాల్లోకి వెళ్లాయి.

భారీ లాభాల నుండి నష్టాల్లోకి...
సెన్సెక్స్ 53,000 పాయింట్ల దిశగా పరుగులు పెట్టినట్లు కనిపించింది. అంతలోనే చివరి గంటలో నష్టపోయింది. సెన్సెక్స్ 52,651.09 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,875.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,448.61 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,776.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,839.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,448.64 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 66.95 (0.13%) పాయింట్లు నష్టపోయి 52,482.71 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 26.95 (0.17%) పాయింట్లు నష్టపోయి 15,721.50 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 1.49 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.20 శాతం, ఇన్ఫోసిస్ 1.14 శాతం, రిలయన్స్ 1.09 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 0.88 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 2.24 శాతం, UPL 1.56 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.55 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.44 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 సూచీ 0.17 శాతం నష్టపోయి, మిడ్ క్యాప్ 0.01 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.37 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.13 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.63 శాతం, లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.68 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.11 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.39 శాతం, నిఫ్టీ మీడియా 0.39 శాతం, నిఫ్టీ మెటల్ 0.39 శాతం, నిఫ్టీ ఫార్మా 0.39 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.31 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications