ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం, ఫిబ్రవరి 15) సరికొత్త శిఖరాలను తాకాయి. బడ్జెట్‌కు ముందు 50వేల పాయింట్ల నుండి 46వేల పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్, బడ్జెట్ రోజు నుండి అంతకంతకూ పెరుగుతోంది. మధ్యలో రెండు మూడు సెషన్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. నేడు సెన్సెక్స్ 52వేల పాయింట్లను దాటి సరికొత్త గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15300 పాయింట్లను క్రాస్ చేసింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఐటీ రంగం స్టాక్స్ దూసుకెళ్లడం సూచీలకు కలిసి వచ్చింది. నేడు ప్రెసిడెంట్స్ డే నేపథ్యంలో అమెరికా మార్కెట్లకు సెలవు.

52,000 క్రాస్ చేసిన సెన్సెక్స్
సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి +565.62 (1.10%) పాయింట్లు లాభపడి 52,110 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఉదయం 51,907.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,141.67 వద్ద గరిష్టాన్ని, 51,886.46 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 15,270.30 పాయింట్లు లాభపడి, 15,321.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,243.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ జాబితాలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, SBI ఉన్నాయి.మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ 3.15 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.56 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.49 శాతం, కొటక్ మహీద్రా బ్యాంకు 2.26 శాతం, ICICI బ్యాంకు 2.30 శాతం లాభపడ్డాయి.టాప్ లూజర్స్ జాబితాలో గ్రాసీమ్ 1.63 శాతం, హీరో మోటోకార్ప్ 1.46 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.30 శాతం, SBI లైఫ్ ఇన్సురా 1.10 శాతం, HDFC లైఫ్ 1.02 శాతం నష్టపోయాయి.రిలయన్స్ షేర్ 0.34 శాతం లాభపడి రూ.2,049 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.98 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.79 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.04 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.00 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.51 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.05 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.32 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.20 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.14 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.05 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ మీడియా 0.23 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications