ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 8) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 386.55 పాయింట్లు (0.97%) లాభపడి 40,265.50 వద్ద, నిఫ్టీ 110.60 పాయింట్లు(0.94%) లాభపడి 11,849.50 వద్ద ప్రారంభమైంది. 725 షేర్లు లాభాల్లో, 235 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 45 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఐటీ స్టాక్స్ 4 శాతానికి పైగా లాభప్డాయి. మెటల్, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం లాభపడ్డాయి.

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్
సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. ఉదయం గం.11.31 సమయంలో సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 40,440 వద్ద ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం గం.11.25 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.

మార్కెట్ లాభాలకు కారణాలు
వివిధ కారణాలతో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఐటీ స్టాక్స్ దుమ్ము రేపుతున్నాయి. ఈ ఫలితాల ద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత వేగంగా తెరుచుకుంటున్నట్లుగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రధానంగా సెప్టెంబర్ నెలలో కార్యకలాపాలు పెరిగినట్లు ఇటీవల సర్వేలు వెల్లడించాయి.
ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(FII) ఇన్-ఫ్లో పెరుగుతున్నాయి. అక్టోబర్ 7వ తేదీ నాటికి నికర కొనుగోలు షేర్లు రూ.1,093.81 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్ 5న రూ.236.73 కోట్లు, అక్టోబర్ 6న రూ.1,101.76 కోట్లుగా ఉంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.
ఆగస్ట్ నెలలో కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ నుండి రూ.1 లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని జనరేట్ చేశాయి. ఇది 64 శాతం పెరిగింది. ఇలా పలు అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచి, మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటానికి కారణమైంది.

ఎగిసిపడిన ఐటీ స్టాక్స్
నిన్న టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్స్ నేడు 5 శాతానికి పైగా లాభపడి రూ.2,875 పలికింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర 4.55 శాతం లాభపడి రూ.865.75 , ఇన్ఫోసిస్ షేర్ వ్యాల్యూ 4.45 శాతం ఎగిసి రూ.1,115.00, టెక్ మహీంద్ర షేర్ వ్యాల్యూ 4.27 శాతం లాభపడి రూ.882, విప్రో షేర్ ధర 5.85 శాతం పెరిగి రూ.355 వద్ద, మైండ్ ట్రీ షేర్ ఏకంగా 10 శాతం పెరిగి రూ.1,527, కోఫోర్జ్ షేర్ 4.76 శాతం పెరిగి రూ.2,509, బిర్లా సాఫ్ట్ షేర్ 3.81 శాతం పెరిగి రూ.203, సొనాటా సాఫ్టువేర్ 5.48 శాతం పెరిగి రూ.336, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ ధర 8.71 శాతం ఎగిసి రూ.2,899 పలికింది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications