ఊగిసలాటలో మార్కెట్లు... ఐనా లాభాల్లోనే: టాప్ గెయినర్స్, లూజర్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లోనే ఉన్నప్పటికీ, ఊగిసలాటలో కనిపించాయి. మధ్యాహ్నం ఓ సమయంలో నష్టాల్లోకి వెళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే అంతలోనే స్వల్పంగా కోలుకుంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 49,000 పాయింట్ల దిశగా సాగుతోంది. నేడు ఓ సమయంలో ఈ మార్కును క్రాస్ చేసింది. నిన్న ప్రారంభం నుండి నష్టాల్లో ఉన్న సూచీలు చివరి అరగంటలో పుంజుకున్న విషయం తెలిసిందే. కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల మద్దతుతో నిన్న రెండో రోజు లాభాలు నమోదు చేసింది. నేడు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతోంది.

భారీ లాభాలు.. ఊగిసలాట
సెన్సెక్స్ నిన్న 48,803 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 48,935.74 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,068.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,694.49 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,599.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,689.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,559.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి సెన్సెక్స్ +60.27 (0.12%) పాయింట్లు లాభపడి 48,864 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59.20 (0.41%) పాయింట్లు ఎగిసి 14,640 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 9.16 శాతం, హిండాల్కో 5.97 శాతం, బీపీసీఎల్ 3.62 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.91 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్స్ 2.74 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు 1.34 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.90 శాతం, టీసీఎస్ 0.81 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.73 శాతం, హెచ్‌యూఎల్ 0.77 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో విప్రో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.39 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.09 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.66 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.81 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.37 శాతం, నిఫ్టీ ఐటీ 1.27 శాతం, నిఫ్టీ మీడియా 1.25 శాతం, నిఫ్టీ మెటల్ 2.28 శాతం, నిఫ్టీ ఫార్మా 0.87 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.34 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.37 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.04 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.18 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications