ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మార్చి 12) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 52వేల సమీపానికి చేరుకోగా, నిఫ్టీ 15,300 పాయింట్లను దాటింది. ఉదయం నుండి మార్కెట్లు భారీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. నిన్న అమెరికా సూచీలు లాభాల్లో ముగిశాయి. బాండ్స్ రాబడులు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గిపోయాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో ఆసియా, భారత మార్కెట్లపై ప్రభావం పడింది. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుండడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదం లభించడం, అమెరికా నిరుద్యోగుల సంఖ్య నవంబర్ నాటి కనిష్ఠానికి పడిపోవడం వంటి పరిణామాలు ఊతమిచ్చాయి.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ ఉదయం 51,660.98 వద్ద ప్రారంభమై, 51,821.84 వద్ద గరిష్టాన్ని, 51,583.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 52,000 దిశగా సాగుతోంది. మధ్యాహ్నం గం.12.16 సమయానికి సెన్సెక్స్ +258.43 (0.50%)
పాయింట్లు లాభపడి 51,537.94 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,321.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,336.30 వద్ద గరిష్టాన్ని, 15,242.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. +75.60 (0.50%) పాయింట్లు ఎగిసి 15,250.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత లాభాలు స్వల్పంగా తగ్గాయి.

టాప్ గెయినర్స్ జాబితా
టాప్ గెయినర్స్ జాబితాలో BPCL 3.14 శాతం, IOC 2.98 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.39 శాతం, టైటాన్ కంపెనీ 2.02 శాతం, లార్సన్ 1.89 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 1.65 శాతం, HDFC లైఫ్ 1.55, బజాజ్ ఆటో 1.39 శాతం, మారుతీ సుజుకీ 1.34 శాతం, హీరో మోటో కార్ప్ 1.18 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర నేడు 0.60 శాతం క్షీణించి రూ.2,168 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.36 శాతం, మిడ్ క్యాప్ సూచీ 0.92 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.80 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.30 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.75 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.50 శాతం, నిఫ్టీ ఐటీ 0.33 శాతం, నిఫ్టీ మెటల్ 2.70 శాతం, నిఫ్టీ మీడియా 0.36 శాతం, నిఫ్టీ మెటల్ 0.31 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.58 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.45 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.25 శాతం, నిఫ్టీ ఫార్మా 0.46 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.18 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications