ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 21) సరికొత్త శిఖరాన్ని తాకింది. కరోనా నేపథ్యంలో కొద్ది నెలల పాటు కుప్పకూలిన సెన్సెక్స్, రెండు నెలలుగా 42వేల పాయింట్ల నుండి ఒక్కో మెట్టు పైకి కదులుతోంది. నేడు ఏకంగా 50,000 మార్కును తొలిసారి దాటింది. ఓ సమయంలో 50,100ను దాటింది. నిఫ్టీ14,800 దిశగా దూసుకెళ్తోంది. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 295 పాయింట్లు ఎగిసి 50,0788 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 14,730 పాయింట్ల వద్ద ఉంది. మార్కెట్ జూమ్‌కు పలు కారణాలు ఉన్నాయి.

అందుకే మార్కెట్ జోరు
జోబిడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టడంతో అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లు లాభపడ్డాయి. వాల్‌స్ట్రీట్ అయితే రికార్డ్ లాభాలను నమోదు చేసింది. డౌజోన్స్ 0.83 శాతం, ఎస్ అండ్ పీ 500 1.40 శాతం, నాస్‌డాక్ 1.97 శాతం మేర లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. ప్రధానంగా జోబిడెన్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్‌లో జోరును నింపింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు తొలిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే, మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లపై ఉండటంతో, మన మార్కెట్లపై కూడా చూపింది.

బడ్జెట్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో మార్కెట్‌కు సానుకూల నిర్ణయాలు వెలువడతాయనే అంచనాలు ఉన్నాయి. ఇది కూడా సెన్సెక్స్ జంప్‌కు కొంత కలిసి వచ్చింది. బడ్జెట్‌కు ముందు సూచీలు పెరగడం లేదా తగ్గడం జరుగుతూంటుంది. బడ్జెట్ సంబంధిత వార్తలకు అనుగుణంగా సూచీలు కదులుతాయి. అలాగే, రెండు నెలలుగా సెన్సెక్స్ పైపైకి చేరుకుంటోంది. 42వేల నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రెండు నెలల కాలంలో 50వేల మార్కును దాటింది.

కార్పోరేట్ ఎర్నింగ్స్
2020-21 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను పలు కంపెనీలు వెల్లడిస్తున్నాయి. కార్పోరేట్ ఎర్నింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ సహా వివిధ కంపెనీల ఫలితాలు బాగున్నాయి. మార్కెట్ పైన కార్పోరేట్ ఎర్నింగ్స్ ప్రభావం కూడా ఉంది. దేశీయ మార్కెట్లోకి ఫారన్ ఫండ్ ఇన్-ఫ్లో పెరుగుతోంది. ఐపీవోలు కూడా అదరగొడుతున్నాయి. ఇలా వివిధ కారణాలతో మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications