Market Opening: రికార్డు గరిష్ఠాల వద్ద Sensex-Nifty ఓపెన్.. నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు గ్లోబల్ మార్కెట్లను ఫాలో అవుతూ ఒడిదొడుకుల్లో ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే ఈ క్రమంలో నేడు కీలక సూచీలు మాత్రం తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాల వద్ద ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఉదయం మార్కెట్ల ఆరంభంలో సెన్సెక్స్ సూచీ 81,587.76 వద్ద ప్రయాణాన్ని మెుదలుపెట్టగా, నిఫ్టీ సూచీ 24,854.80 పాయింట్ల గరిష్ఠాన్ని నేడు టచ్ చేసింది. ఉదయం 9.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 49 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 546 పాయింట్ల భారీ నష్టంతో నేడు ఇంట్రాడేలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్ది నష్టాల నుంచి రికవరీ అవుతున్నాయి. ఈ క్రమంలో క్యూ1 మార్కెట్ అంచనాలను మించి అందించిన ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు మాత్రం భారీగా లాభపడ్డాయి.

NSEలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, ఎల్ టిఐఎమ్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, విప్రో, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, సన్ ఫార్మా, గ్రాసిమ్, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications