ఆన్‌లైన్ మోసాలకి సంబంధించిన మరో కేసులో బెంగళూరుకు చెందిన ఓ సీనియర్ సిటిజన్ బలైయ్యాడు, దింతో అతను ఏకంగా రూ.6.41 కోట్లు కోల్పోయాడు. బాధితురాడి ప్రకారం స్కామర్ వాట్సాప్ ద్వారా అతనితో కనెక్ట్ అవగా ఆన్‌లైన్ ట్రైనింగ్ సెషన్ పేరిట స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి నేర్పిస్తామంటూ ఆశ చూపి నిండా ముంచారు.
బెంగుళూరు మిర్రర్ నివేదిక ప్రకారం, బాధితుడికి జూలై 19న వాట్సాప్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయమైనట్లు తెలిపింది. తన పేరు మీరా పటేల్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ మెంబర్ అంటూ బాధితుడికి పరిచయం చేసుకుంది. తరువాత "ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్"కి రిప్రజెంటర్స్ అంటూ హార్దిక్ షా అండ్ ఆశిష్ గోయల్‌ని పరిచయం చేస్తూ ఒక గ్రూప్‌లోని ఇతరులతో కూడా అతనిని కనెక్ట్ చేసింది. అయితే ఈ సంస్థ ఒక పెట్టుబడి సలహా సంస్థ అని స్కామర్‌లు అతనికి చెప్పారు. స్కామర్‌లు అతనితో పరిచయం చేసుకున్న తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించేందుకు ప్లాన్ చేసి మీ పెట్టుబడులపై 700 శాతం ఎక్కువ రాబడి ఇప్పిస్తామని నమ్మకంగా పలికారు.

ఇది నిజమైన గ్రూప్ అని నమ్మి స్టాక్ మార్కెట్ ఇంకా పెట్టుబడుల గురించి మరింత తెలుసుకోవాలనే ఆశతో బాధితుడు వారి మాటలకు పడిపోయాడు. తరువాత స్కామర్లు 15 రోజుల్లో ప్రొఫెషనల్ ఆన్‌లైన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించారు. ఈ సమయంలోనే బాధితుడుని ఇతర గ్రూప్ సభ్యులతో పాటు ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు, అ గ్రూప్లో పెట్టుబడి నిపుణులమంటూ స్టాక్ మార్కెట్ గురించి విషయాలను షేర్ చేసుకున్నారు. స్టాక్ సజెషన్స్, IPOలు, బ్లాక్ ట్రేడింగ్‌పై ట్రైనింగ్ ఇచ్చారని తెలపగా, ఈ ట్రైనింగ్ బాధితుడికి నిజమని అనిపించి వారి స్కామ్‌లో చిక్కుకున్నాడు.
చివరికి స్కామర్లు పెద్ద మొత్తంలో బాధితుడిని డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి తెచ్చారు. మొదట్లో ప్రిఫరెన్షియల్ స్టాక్, IPO సబ్‌స్క్రిప్షన్‌ల కోసం తరువాత లాభాలను అన్‌లాక్ చేయడానికి హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ బెనిఫిట్స్ కోసం డబ్బులు అవసరమని పేర్కొంటూ దీనికితోడు "సెక్యూరిటీ డిపాజిట్లు" అంటూ మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దింతో బాధితుడు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించాడు. అక్కడితో వారు ఆగలేదు.
బాధితునికి తన డబ్బును తిరిగి పొందాలనే కోరికతో స్కామర్ల నుండి పెరుగుతున్న డిమాండ్ వల్ల రూ.70 లక్షలతో సహా రూ. 3.2 కోట్ల లోన్ తీసుకొని ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి కూడా అప్పు తీసుకున్నాడు. ఇలా అతను మొత్తంగా రూ. 6.41 కోట్లు పెట్టుబడి పెట్టగ ఎలాంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా అవి మాయమ్మయ్యాయి . మీరా పటేల్, ఆమె సహచరులను సంప్రదించడానికి పదేపదే ట్రై చేసిన ఎలాంటి ఫలితం లేదు. దింతో చివరికి అతనికి మోసపోయానని అర్ధమైంది. పోలీసుల విచారణలో భాగంగా స్కామర్లు రాకరాకల ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్స్, లాభాలు వచ్చినట్లు నకిలీ ట్రాన్సక్షన్స్ చూపించే ఫేక్ ఆన్‌లైన్ పోర్టల్ ఉపయోగించి ఆపరేట్ చేశారని అధికారులు వెల్లడించారని ఒక నివేదికలో పేర్కొంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications