Senco Gold Stock: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇంట్రాడేలో నష్టాల నుంచి తిరిగి కోలుకున్న సూచీలు దీపావళికి ముందు అలజడి నుంచి ప్రశాంతంగా చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బంగారం, వెండి అమ్మే దుకాణాలే. దేశవ్యాప్తంగా నేడు అమ్మకాలు రూ.60 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేయబడింది.
ఆభరణాల స్టాక్‌లు సాధారణంగా ధన్‌తేరస్ రోజున లాభపడుతుంటాయి. ఎందుకంటే ఈ పండుగ రోజున సహజంగా ఖరీదైన లోహాలను కొనుగోలు చేయడానికి మంచి సమయంగా పరిగణిస్తుంటారు. కానీ నేడు సెన్‌కో గోల్డ్ లిమిటెడ్ షేర్ల విషయంలో అలా జరగలేదు. ఇంట్రాడేలో స్మాల్ క్యాప్ స్టాక్ ధర ఏకంగా 19.10 శాతం క్షీణించి రూ.981.30 వద్ద రోజు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. సెషన్ పురోగమిస్తున్నందున స్క్రిప్ కొంత నష్టాన్ని పొందింది. అయితే చివరికి స్టాక్ 5.12 శాతం తగ్గి రూ.1,150.90 వద్ద ట్రేడయింది.

వాస్తవానికి హఠాత్తుగా నేడు కంపెనీ షేర్లు పడిపోవటానికి కారణం కంపెనీ, దాని ప్రమోటర్లకు చెందిన స్థావరాల్లో రైడ్ నిర్వహించనట్లు వచ్చిన వార్తలతో స్టాక్ పతనాన్ని చూసింది. అయితే ఇది పూర్తిగా పుకారేనని, ఎటువంటి వాస్తవం లేదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. దీంతో కంపెనీ షేర్లు కొంత మేర నష్టాల నుంచి తిరిగి పుంజుకున్నాయి. కంపెనీ షేర్లపై వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌లోని ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని ప్రస్థావిస్తూ షేర్లు అద్భుతమైన బుల్ ర్యాలీని చూసిన తర్వాత కన్సాలిడేషన్ దశలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల భారీగా గోల్డ్ ధరలు పెరగటం స్వల్పకాలిక అమ్మకాలపై ఒత్తిడిని కలిగిస్తుందని అన్నారు. అలాగే గోల్డ్ రేట్లు అధికంగా కొనసాగుతున్నప్పటికీ ఆభరణాల రిటైల్ కంపెనీలు బాగా రాణిస్తాయని ఆశించినందున, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడిదారులు స్టాక్‌ను హోల్డ్ చేయాలని సూచించారు. రూ.980-1,035 ధర వద్ద సపోర్ట్ జోన్ ఉంటుందని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్‌లోని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ - టెక్నికల్ & డెరివేటివ్స్ ఓషో క్రిషన్ మాట్లాడుతూ సెన్కో విస్తృత కాలపరిమితిలో అధిక గరిష్టాలు, అధిక కనిష్టాలను ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుతం రూ.1,000-980 జోన్‌లో బలమైన సపోర్ట్ జేన్‌గా పేర్కొంది. అలాగే స్టాక్‌బాక్స్‌లోని టెక్నికల్ అనలిస్ట్ కుశాల్ గాంధీ షేర్లకు రూ.1,215 టార్గెట్ ధరను అందిస్తూ.. స్టాప్ లాస్ ధరను రూ.1,035గా పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఆనంద్ రాఠీ సీనియర్ మేనేజర్, టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ రూ.1150 ధరకు పైన పెరిగే అవకాశాలు ఉన్నాయనన్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications