IPO News: ఇటీవల మార్కెట్లోకి ఒక్కసారిగా అనేక ఐపీవోలు అడుగుపెట్టాయి. ఈ క్రమంలో కొన్ని ప్రజల నుంచి భారీ స్పందనను పొందుతున్నాయి. పైగా వాటి గ్రే మార్కెట్ ప్రీమియం సైతం ఊహించని స్థాయిలో ఉంటున్నాయి.
గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యాపారంలో చాలా కాలంగా కొనసాగుతున్న సెన్కో గోల్డ్ తాజాగా తన ఐపీవోను ప్రారంభించింది. దీనికి ప్రజల నుంచి విషేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో ఐపీవో మొత్తం 77.23 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అలాగే రిటైల్ కోటా 16.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇదే సమయంలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా(NII) 68.44 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 190.56 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.

మంచి స్పందన కారణంగా గ్రే మార్కెట్‌లోనూ సెన్‌కో గోల్డ్ ఐపీవోకు మంచి ధర పలుకుతోంది. గురువారం గ్రే మార్కెట్‌లో సెన్కో గోల్డ్ షేర్లు రూ.90 ప్రీమియంతో ట్రేడవుతున్నాయనిషేర్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సెంకో గోల్డ్ IPO ప్రైస్ బ్యాండ్ రూ.301-317గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ షేర్లు రూ.317 ధరతో కేటాయించబడి, రూ.90 గ్రే మార్కెట్ ప్రీమియం కొనసాగితే కంపెనీ షేర్లు రూ.407 ధర వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ లెక్కన షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ అయిన తొలి రోజునే దాదాపు 30% లాభాన్ని పొందవచ్చు.
సెన్కో గోల్డ్ ఇష్యూ మొత్తం పరిమాణం రూ.405 కోట్లుగా ఉంది. కంపెనీ IPOలో షేర్ల కేటాయింపు జూలై 11, 2023 నాటికి ఫైనల్ అవుతుంది. అదే సమయంలో కంపెనీ షేర్లను జూలై 14, 2023న ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు IPOలో కనీసం 1 లాట్, గరిష్టంగా 13 లాట్‌ల వరకు కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో లాట్ లో 47 షేర్లు ఉంటాయి. అయితే ఐపీవో తర్వాత ప్రమోటర్ల వాటా కంపెనీలో 68.48 శాతానికి పరిమితం కానుంది.


Click it and Unblock the Notifications