Heritage Foods: చంద్రబాబు అరెస్టుతో కుప్పకూలిన హెరిటేజ్ స్టాక్.. అమ్మాలా.. కొనాలా..??
Chandrababu Arrest: మాజీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్మాక్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో జరిగిన వాడివేడి వాదనల తర్వాత జడ్జి 14 రోజుల పాటు రిమాండుకు చంద్రబాబును పంపారు. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకపక్క పార్టీ శ్రేణులు బంద్ కు పిలుపునివ్వగా.. మరో పక్క భద్రతా కారణాల రీత్యా 144 సెక్షన్ అమలు కొనసాగుతోంది.

అయితే ఈ మెుత్తం పరిణామాల ప్రభావం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీపై ప్రతికూలంగా ఉంది. మధ్యాహ్నం 12.32 గంటల సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ఎన్ఎస్ఈలో 5.63 శాతం క్షీణించి రూ.256.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే బీఎస్ఈలో స్టాక్ ధర 5.59 శాతం క్షీణించి రూ.256.75 వద్ద ట్రేడవుతోంది.

అయితే ప్రస్తుతం షేర్లలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. కొందరు ఇన్వెస్టర్లు 2024 ఎన్నికల తర్వాత కొనుగోలు చేయటం ఉత్తమం అని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల హీట్ కారణంగా ఏర్పడిన పరిస్థితులతో అమ్మకాల జోరు కొనసాగుతోంది. కంపెనీ షేర్లలో నేడు రేపు ఇదే ధోరణి కొనసాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ప్రస్తుతం తక్కువ ధరలకు కొనుక్కుని హోల్డ్ చేయటం ద్వారా ఎన్నికల తర్వాత టీడీపీ గెలిస్తే మంచి లాభాలను పొందవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications