బంగారంపై రుణం కంటే అమ్మడమే లాభం, ఎందుకంటే? జోయ్‌అలుక్కాస్ బంపరాఫర్

భారతదేశ‌ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. బంగారం కొనుగోలు ఓ విధంగా పెట్టుబడే అయినా, బంగారు ఆభరణాలపై భారతీయులకు మక్కువ ఎక్కువే. ప్రత్యేకమైన ఆభరణాల ఎంపికలో ఇదే విషయం స్పష్టమవుతోంది.

ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, తక్షణం డబ్బు పొందే మార్గాల గురించి ఆలోచిస్తాం. వెంటనే మన ఆలోచన బంగారం వైపే వెళుతుంది. కానీ ఆ బంగారు ఆభరణాలపై మనకున్న ప్రేమ కొద్దీ వాటిని విక్ర‌యించాలంటే మనసొప్పదు. అందుకే బంగారంపై రుణం పొందేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఇది తెలివైన ఆలోచన కాదు. అంచ‌నా ప్ర‌కారం కేర‌ళ‌లో స‌గ‌టు మళయాళీ త‌న‌కేమైన ఆర్థిక అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పు‌డు వెంటనే డబ్బు పొందాలంటే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనే ఆలోచిస్తారు. కానీ మనం ఆలోచించాల్సిన సమయం వ‌చ్చింది. బంగారంపై రుణం తీసుకోవాలా? లేదంటే బంగారాన్ని విక్రయించాలా? అనే అంశాన్ని పరిశీలించాల్సిన సమయం.

బంగారంపై రుణం అంటే.. భారమే

బంగారంపై రుణం అంటే.. భారమే

మనచుట్టూ బంగారంపై రుణాలు అందజేసే సంస్థలు చాలానే ఉన్నాయి. అవన్నీ బంగారం రుణాలపై తక్కువ వడ్డీ, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఏది ఏమైనప్పటికీ బంగారంపై రుణం తీసుకున్నామంటే మనం అప్పు లో ఉన్నట్లే లెక్క. బంగారంపై రుణం తీసుకున్న క్షణం నుంచి మనం తీసుకున్న సొమ్ముపై వడ్డీ ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మన బంగారాన్ని తిరిగి తీసుకోవాలంటే తీసుకున్న రుణం, వడ్డీతోస‌హా అంతా చెల్లించాల్సి ఉంటుంది.

మీ బంగారం కొనేందుకు జోయ్ అలుక్కాస్ సిద్ధం

మీ బంగారం కొనేందుకు జోయ్ అలుక్కాస్ సిద్ధం

ప్రతిసారి ఇదే ఆలోచన ఎందుకు చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తూ చిక్కుల్లో పడుతున్నాం. అత్యవసర సమయాల్లో బంగారాన్ని విక్ర‌యించే ఆలోచన చేయడం కూడా ముఖ్యం. జోయ్ అలుక్కాస్ వంటి జ్యువెలరీ షాపులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నాయి. గతంలో ఈ బంగారం ఎక్కడ నుంచి కొనుగోలు చేశారు? అనే విషయంతో సంబంధం లేకుండా అప్ప‌టిక‌ప్పుడే బంగారాన్ని కొనుగోలు చేసి వెంటనే డ‌బ్బు ఇస్తున్నాయి.

ఎక్కడ కొన్నా మీకు మంచి ధర వస్తుంది

ఎక్కడ కొన్నా మీకు మంచి ధర వస్తుంది

కొన్ని అవుట్‌లెట్లు తమ దగ్గర కొన్న బంగారు ఆభరణాలకు మాత్రమే మంచి ధర నిర్ణయించి బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తున్నాయన్న పుకార్లు లేకపోలేదు. అయినప్పటికీ జోయ్ అలుక్కాస్ లాంటి జ్యువెలరీ షాపుల్లో ఇలాంటిదేదీ ఉండ‌దు. బంగారు ఆభ‌ర‌ణాలు ఎక్క‌డ‌కొన్న‌వైనా స‌రే, మంచి ధరని నిర్ణ‌యించి కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు తాము బంగారాన్ని విక్రయించిన తర్వాత చెల్లింపుల కోసం ఎక్కువ సేపు నిరీక్షణ చేయాల్సిన పని కూడా లేదు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా బంగారం ధరలు అధికంగా ఉన్న స‌మ‌యాల్లో బంగారాన్ని జ్యువెల‌రీ షాప్‌లో విక్రయించినట్లయితే మంచి ధర లభించే అవకాశం ఉంది. ఒక‌వేళ వెంటనే డబ్బు అవసరం బంగారాన్ని విక్ర‌యించిన సొమ్మును పొదుపుచేసుకోవ‌చ్చు.

బంగారంపై రుణం కంటే.. విక్రయం బెట్టర్.. రెట్టింపు ధర!

బంగారంపై రుణం కంటే.. విక్రయం బెట్టర్.. రెట్టింపు ధర!

ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, ఆ ప‌రిస్థితుల నుంచి గట్టెక్కడానికి బంగారాన్ని విక్రయించడానికి మ‌దన‌ప‌డాల్సిన అవసరం లేదని ఈ రంగంలో ఉన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న త‌ర్వాత‌ బంగారాన్ని మ‌ళ్లీ కొనుక్కోవచ్చు. బంగారు రుణం తీసుకుని, వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లించే సొమ్ముతో కొత్త బంగారు ఆభ‌రణాలు స‌రికొత్త డిజైన్ల‌తో కొనుక్కోవ‌చ్చు.

ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోతే మీరు విక్రయించిన బంగారానికి సమానంగా కొత్త డిజైన్లలో త‌యారుచేసిన‌ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి ఆలోచనలు చేయడానికి ఇదే మంచి సమయం. చాలా ఏళ్ల క్రితం తక్కువ ధరకు మీరు కొనుగోలు చేసుకుని ఉంటే, అదే బంగారాన్ని రెట్టింపు ధరకు విక్రయించవచ్చు. మీ దగ్గర ఉన్న పాత ఆభరణాలను ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త బంగారు ఆభరణాలు పొందేందుకు ఇదే మంచి సమయం.

జోయ్ అలుక్కాస్‌లో షాపింగ్.. ధరపై మంచి ఆఫర్

జోయ్ అలుక్కాస్‌లో షాపింగ్.. ధరపై మంచి ఆఫర్

అంతేకాకుండా మీరు జ్యువెల‌రీ షాప్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గర కూర్చుని మీకు కావాల్సిన డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జోయ్ అలుక్కాస్ నుంచి షాపింగ్ చేయాలనుకుంటే www.joyalukkas.com వెబ్ సైట్ అందుబాటులో ఉంది. అధునాతన డిజైన్‌లు, ట్రెండీ ఆభ‌ర‌ణాలు ఈ వెబ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు మీ డబ్బును బంగారం కొనుగోలు ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. తక్కువ నగదు అడ్వాన్స్ గా చెల్లించి మీకు కావలసిన రీతిలో ఆభరణాలు తయారు చేసుకునేందుకు బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ బంగారం ధర పెరిగినట్లయితే, బుకింగ్ చేసుకున్న సమయానికి ఏదైతే ఉందో అదే ధరకు అందజేస్తారు. ఒకవేళ బంగారం ధర తగ్గినట్లయితే తగ్గిన ధ‌ర‌కే మీకు అందజేస్తారు. ఏవిధంగా చూసినా లాభమే.

జోయ్ అలుక్కాస్ ఈజీ గోల్డ్ స్కీం కూడా అలాంటిదే. మీరు ప్రతి నెలా కొంత నగదును డిపాజిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈజీ గోల్డ్ ప‌ర్చేజ్ స్కీం ద్వారా మీరు ప్రతినెల నిర్ణీత‌ నగదును డిపాజిట్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఎంచుకున్న ఆభరణాలకు సంబంధించి మేకింగ్ చార్జీలు, ఇతర ఛార్జీలు ఏమీ లేకుండా నిర్ణయించిన ధరకే అందజేస్తారు. ఒకవేళ ఆ న‌గ‌ల్లో ప్ర‌త్యేక‌మైన‌ రాళ్ళు, డిజైన్‌లో ఇతర మార్పులు చేర్పులు ఏమైనా చేయదలుచుకుంటే అందుకు సంబంధించిన డబ్బులు, ప‌న్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిపాజిట్ చేసిన డబ్బును ముందే తీసుకోవాలనుకుంటే అప్పటివరకు మీరు జమచేసిన నగదుకు స‌రిప‌డా బంగారం కొనుక్కోవచ్చు. బంగారంపై రుణం కన్నా, బంగారం విక్రయం గురించి ఆలోచించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+