Telangana: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణంలోని స్వయం సహాయక సంఘాల రుణాలకు అవసరమైన నిధుల కేటాయింపు ప్రక్రియ మెుదలైంది. ఇందుకోసం స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి కొత్త ఏడాదికి నిధులు అందుకోనున్నాయి.
శుక్రవారం నగరంలో జరిగిన తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన 10వ జనరల్ బాడీ సమావేశం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో మహిళా సహాయక సంఘాలు దాదాపు రూ.2,710 కోట్లను రుణాల కోసం అందుకోనున్నాయి. ఈక్రమంలో మండల సమాఖ్య పదవీకాలాన్ని ప్రస్తుతం ఉన్న ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించడంతోపాటు ఎస్‌హెచ్‌జీ సభ్యులు మరణిస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ స్త్రీ నిధి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈ దయాకర్ రావు కొనియాడారు. రాజస్థాన్ ప్రభుత్వం దీనిని అనుకరిస్తోందని ఆయన తెలిపారు. గత 12 సంవత్సరాలుగా స్త్రీనిధి సమర్థవంతంగా పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 1.59 లక్షల స్వయం సహాయక సంఘాల నుంచి 5.3 లక్షల మంది సభ్యులు వివిధ ప్రాజెక్టుల కోసం రుణాలు పొందినట్లు ఆయన వెల్లడించారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications